ETV Bharat / state

తలకిందులైన పత్తి అంచనాలు.. రైతుల ఆవేదన - దూది పూల అంచనాలు గల్లంతయ్యాయి.

దూది పూల అంచనాలు గల్లంతయ్యాయి. రాష్ట్రంలో గత ఖరీఫ్‌ సీజన్‌లో 4.22 కోట్ల క్వింటాళ్లు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినా... ఇప్పటి వరకూ అందులో సగం కూడా రాలేదు. అక్టోబరు మాసంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట దిగుబడుల లెక్కలన్నీ పూర్తిగా తారుమారైనట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు ప్రకటించాయి. మార్కెట్‌లో పంట లేకపోవడం వల్ల భారత పత్తి సంస్థ అధికంగా కొనుగోలు చేస్తోంది.

low cotton production per farmer disappointment
తలకిందులైన పత్తి అంచనాలు.. రైతుల ఆవేదన
author img

By

Published : Jan 18, 2020, 5:03 AM IST

రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి అంచనాలు లెక్క తప్పాయి. వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం పంట దిగుబడి తగ్గిందని మార్కెట్ల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 46.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగుచేశారు. 4.22 కోట్ల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ గత అక్టోబరులో ప్రభుత్వానికి నివేదించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేవలం కోటిన్నర క్వింటాళ్లు మాత్రమే మార్కెట్​కు వచ్చింది.

రైతుల ఆందోళన..
గత ఆగస్టు నుంచి అక్టోబర్​ వరకు కురిసిన భారీ వర్షాలతో పత్తి పంటకు అధికంగా నష్టం కలిగింది. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు 2.43 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆర్థిక, గణాంక శాఖ తొలి అంచనాల్లో తేలిపింది. అంతకన్నా ఎక్కువగా 4.22 కోట్ల క్వింటాళ్లు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఒక ఎకరానికి 9 క్వింటాళ్ల వరకు పంట ఉత్పాదకత వస్తుందని తెలిపినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు.

ఐదారు క్వింటాళ్లకు మించి రావడంలేదు
వర్షాల ప్రభావంతో పత్తికాయ నల్లగా మారి కొన్ని చోట్ల ఎకరానికి ఐదారు క్వింటాళ్లకు మించి దూది రావడంలేదు. భారత పత్తి సంస్థ-సీసీఐ రాష్ట్రంలో మద్దతు ధరకు ఇప్పటి వరకూ 1.13 కోట్ల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు మరో 34 లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఇక సరిహద్దు జిల్లాల వారు ఇతర రాష్ట్రాలకు కొంత తరలించి అమ్ముకుంటున్నారు. అంతా కలిపినా ఇప్పటికీ మార్కెట్లకు కోటిన్నర క్వింటాళ్లకు మించి రాలేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి.

గడేడాది ఇదే సమయంలో
సీసీఐ ఈసారి భారీగా కొంటున్న దృష్ట్యా రైతులు బయట అమ్మడం లేదని చెబుతున్నారు. గతేడాది ఇదే సమయంలో రోజుకు సుమారు 20 వేల బస్తాల పత్తి ఖమ్మం వ్యవసాయ మార్కెట్​కు వచ్చేది. ఇప్పుడు అదే మార్కెట్​కు 12 వేల బస్తాలు కూడా రావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక రైతు నుంచి ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొంటామని సీసీఐ నిబంధన పెట్టడం ఇబ్బందిగా పరిణమించింది. అయితే ఆ స్థాయిలో పత్తి పంట దిగుబడి వచ్చిన రైతులు అరుదుగా కనిపిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎకరానికి రూ. 30 వేలకు పైగా పెట్టుబడి ఖర్చైనట్లు రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. మార్కెట్‌లో ఒక క్వింటాల్ పత్తి కనీస మద్దతు ధర రూ. 5,550గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా.. 4 వేలకు మించి పలకడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. పత్తిలో తేమ, నాణ్యత వంటి సాకులు చూపుతూ సీసీఐ, వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

తలకిందులైన పత్తి అంచనాలు.. రైతుల ఆవేదన

ఇదీ చూడండి : ఒవైసీకో న్యాయం మాకో న్యాయమా: ఎంపీ అర్వింద్​

18-01-2020 TG_HYD_01_18_COTTON_YIELDS_DOWN_PKG_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) దూది పూల అంచనాలు గల్లంతయ్యాయి. రాష్ట్రంలో గత ఖరీఫ్‌ సీజన్‌లో 4.22 కోట్ల క్వింటాళ్లు వరకు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినా... ఇప్పటి వరకూ అందులో సగం కూడా రాలేదు. అక్టోబరు మాసంలో కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పత్తి తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించింది. అయితే... పత్తి పంట దిగుబడుల లెక్కలన్నీ పూర్తిగా తారుమారైనట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు ప్రకటించాయి. మార్కెట్‌లో పంట లేకనే భారత పత్తి సంస్థ అధికంగా కొనుగోలు చేస్తోంది. LOOK....... VOICE OVER - 1 రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి అంచనాలు లెక్క తప్పాయి. ముందుగా వ్యవసాయ శాఖ వేసిన అంచనాల ప్రకారం... పంట దిగుబడి లేవని తాజాగా మార్కెట్ల లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 46.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగైన దృష్ట్యా... 4.22 కోట్ల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ గత అక్టోబరులో ప్రభుత్వానికి నివేదించింది. కానీ, రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేవలం కోటిన్నర క్వింటాళ్లే మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు అమ్మకానికి వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ కురిసిన భారీ వర్షాలతో పత్తి పంటకు నష్టం అధికంగా ఉన్నందునే ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు 2.43 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆర్థిక, గణాంక శాఖ ప్రాధమిక తొలి అంచనాల్లో తేలిపింది. కానీ, ఇంత కన్నా చాలా ఎక్కువగా 4.22 కోట్ల క్వింటాళ్లు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఒక ఎకరానికి 9 క్వింటాళ్ల వరకు పంట ఉత్పాదకత వస్తుందని తెలిపినా కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు. భారీ వర్షాల ప్రభావంతో పత్తి కాయ నల్లగా మారిపోయి దూది కొన్ని చోట్ల రైతులకు ఎకరానికి ఐదారు క్వింటాళ్లకు మించి పంట దిగుబడి రాలేదు. కొన్ని చోట్ల రెండుసార్లు దూది తీసి రైతులు తోట వదిలేస్తున్నారు. భారత పత్తి సంస్థ - సీసీఐ రాష్ట్రంలో మద్ధతు ధరకు ఇప్పటి వరకూ 1.13 కోట్ల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి నేరుగా కొన్నది. ప్రైవేటు వ్యాపారులు మరో 34 లక్షల క్వింటాళ్లు వరకు కొనుగోలు చేశారు. ఇక సరిహద్దు జిల్లాల వారు కూడా ఇతర రాష్ట్రాలకు కొంత తరలించి అమ్ముకుంటున్నారు. అంతా కలిపినా ఇప్పటికీ మార్కెట్లకు కోటిన్నర క్వింటాళ్లకు మించి రాలేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. సీసీఐ ఈసారి భారీగా కొంటున్న దృష్ట్యా రైతులు బయట అమ్మడం లేదని చెబుతొన్నాయి. ఉదాహరణకు గత ఏడాది ఇదే సమయంలో రోజుకు సుమారు 20 వేల బస్తాలకు పైగా పత్తి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చేది. ఇప్పుడు అదే మార్కెట్‌ యార్డుకు 12 వేల బస్తాలు రావడం కూడా కష్టంగా ఉంది. ఒక రైతు నుంచి ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొంటామని సీసీఐ నిబంధన పెట్టడం ఇబ్బందిగా పరిణమించింది. VOICE OVER - 2 కానీ, ఆ స్థాయిలో పత్తి పంట దిగుబడి వచ్చిన రైతులు అరుదుగా కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకరానికి 30 వేల రూపాయలు పైగా పెట్టుబడి ఖర్చైనట్లు రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. మార్కెట్‌లో ఒక క్వింటాల్ పత్తి కనీస మద్ధతు ధర 5550 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ... 4 వేల రూపాయలు మించి పలకడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. పత్తిలో తేమ, నాణ్యత వంటి సాకులు చూపుతూ సీసీఐ లేదా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.