భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రానున్న నేపథ్యంలో స్థానిక భాజపా నాయకులు బైక్ ర్యాలీకి అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు.
ఈ రోజు ఆర్మూర్లో ఎంపీ అర్వింద్ ప్రచారంలో ఉండగా సీపీ కార్తీకేయ ఫోన్ చేశారు. రాజా సింగ్ పర్యటనకు అనుమతివ్వని పోలీసులు ఒవైసీ పర్యటనకు ఎలా అనుతిస్తారంటూ సీపీని ప్రశ్నించారు ఎంపీ. రేపు చేపట్టే నిరాహార దీక్షను తాను విరమించుకున్నట్లు చెప్పారు. అనుమతి ఇచ్చినా ఇవ్వపోయినా రేపు ద్విచక్ర వాహన ర్యాలీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు.