ETV Bharat / state

20 రోజుల్లో రూ.1,500 కోట్ల మద్యం తాగేశారు!

author img

By

Published : Jan 21, 2020, 5:04 AM IST

Updated : Jan 21, 2020, 7:29 AM IST

పురపోరుతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. జనవరి 1 నుంచి 20 వరకు దాదాపుగా రూ.1,500 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. గతేడాదితో పోల్చితే సుమారు రూ.350 కోట్లు అధికం.

liquor sales
20 రోజుల్లో రూ.1500 కోట్ల మద్యం విక్రయాలు

మున్సిపల్‌ ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. జనవరి 1 నుంచి 20 వరకు సుమారు రూ.1,500 కోట్లు విలువైన 21.90 లక్షల కేసుల లిక్కర్‌, 20.80 లక్షల కేసుల బీరు అమ్ముడుపోయాయి. 2019 జనవరి ఒకటి నుంచి 20 వరకు రూ.1,120 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగగా.. పురపాలక ఎన్నికల కారణంగా ఈ ఏడాది సుమారు రూ.1,500 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. గతేడాదితో పోల్చితే కేవలం 20 రోజల్లో సుమారు రూ.350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి.

రంగారెడ్డిలో రూ.323 కోట్లు, హైదరాబాద్‌లో రూ.147 కోట్లు, నల్గొండలో రూ.170 కోట్లు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.110 కోట్లు, మెదక్‌లో రూ.121 కోట్లు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రూ.140 కోట్లు , కరీంనగర్‌లో రూ.130 కోట్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.82 కోట్లు చొప్పున మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

సాధారణ విక్రయాల కంటే పుర ఎన్నికల పుణ్యమా అని మద్యం అమ్మకాలు ఘనంగా పెరిగాయి. మరో వైపు అక్రమ మద్యం చొరబడకుండా ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు.

ఇవీచూడండి: పుర పోరుపై... పోలీసుల నిఘా!

sample description
Last Updated : Jan 21, 2020, 7:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.