ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా నిరవధిక దీక్ష చేస్తామని ప్రకటిస్తే జేఏసీ నాయకులను గృహానిర్భందించం, వారి ఇళ్లపై దాడులను ఆయన ఖండించారు. ప్రభుత్వ తీరు కార్మికులను రెచ్చగొట్టే పద్ధతుల్లో ఉందని దుయ్యబట్టారు.
కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా చర్చించి విలీనాన్ని వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఆహ్వానించి చర్చలకు పిలవాల్సిందిపోయి రెచ్చగొట్టే పద్ధతిని అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో తక్షణమే ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : ఉద్యోగం రాదని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం