'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది' - 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'
ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగిపోయిందని... ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. డబ్బులు ఖర్చు చేయకపోతే ఓట్లు రావనే అభిప్రాయం బలపడిందని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై నేడు, రేపు హైదరాబాద్ వేదికగా సదస్సు నిర్వహిస్తున్నట్లు జేపీ వెల్లడించారు. ఎన్నికల విధానాల్లో సంస్కరణతోనే మార్పు సాధ్యమవుదంటున్న జయప్రకాశ్ నారాయణతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.