ETV Bharat / state

ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం! - Govt On Tsrtc

ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠను రేపుతోంది. సమస్యకు ముగింపు పలికేందుకు రేపు మంత్రివర్గాన్ని సీఎం కేసీఆర్ సమావేశపర్చనున్నారు. కార్మిక న్యాయస్థానంలోనే తేల్చుకుంటారా... లేక కార్మికశాఖ కమిషనర్ స్థాయిలోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారా అనేది తేలాల్సి ఉంది. కార్మికుల భవిష్యత్​పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రేపు తెలియనుంది.

కేబినెట్ మీటింగ్​ తర్వాతే భవిష్యత్...
కేబినెట్ మీటింగ్​ తర్వాతే భవిష్యత్...
author img

By

Published : Nov 27, 2019, 5:35 AM IST

Updated : Nov 27, 2019, 7:22 AM IST

'ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం'

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినప్పటికీ విధులకు హాజరు కాని దుస్థితి నెలకొంది. చట్టవిరుద్ధంగా సమ్మెలోకి వెళ్లిన కార్మికులు... ఇష్టారీతిన మళ్లీ విధుల్లో చేరతామంటే నిబంధనలు అంగీకరించబోవని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమస్యను ముగించేందుకే రేపు మంత్రివర్గాన్ని సమావేశపరుస్తున్నట్లు స్పష్టం చేసిన సర్కార్... అవసరమైతే శుక్రవారం కూడా భేటీ కొనసాగించనున్నట్లు తెలిపింది.

అందరినీ కొనసాగిస్తారా లేదా?

ప్రస్తుతమున్న 49 వేల మంది సిబ్బందిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తారా లేదా అనే విషయం మంత్రి వర్గం నిర్ణయించనుంది. ఇప్పుడు ఉద్యోగులు, సిబ్బందిని ఎలా తగ్గిస్తారనేది అందరి ప్రశ్న. ఇందుకోసం ఏం చేస్తారు... ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్న విషయమై భిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిర్బంధ లేదా స్వచ్ఛందంగా పదవీవిరమణ అమలు చేయవచ్చన్న వాదన వినిపిస్తోంది.

ప్రక్రియ పూర్తికి సర్కార్​ను సంప్రదిస్తారా లేదా ?

హైకోర్టు ఆదేశాల ప్రకారం కార్మిక శాఖ కమిషనర్ సమ్మెకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్మిక న్యాయస్థానానికి నివేదించాలా వద్దా అన్నది కమిషనరే తేల్చాల్సి ఉంది. కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తే పరిష్కారం కోసం చాలా సమయం పడుతుందని అంటున్నారు. కార్మిక న్యాయస్థానానికి నివేదించకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రందించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అప్పుడు సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తికరం.

ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు

File : TG_Hyd_01_27_Govt_on_RTC_Pkg_3053262 From : Raghu Vardhan ( ) ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠను రేపుతోంది. సమస్యకు ముగింపు పలికేందుకు రేపు మంత్రివర్గాన్ని సమావేశపర్చనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారన్నది ఇపుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. కార్మిక న్యాయస్థానంలోనే తేల్చుకుంటారా... లేక కార్మికశాఖ కమిషనర్ స్థాయిలోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారన్నది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది...లుక్ వాయిస్ ఓవర్ - ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినప్పటికీ విధులకు హాజరు కాని పరిస్థితి నెలకొంది. చట్టవిరుద్ధంగా సమ్మెలోకి వెళ్లిన కార్మికులు... ఇష్టారీతిన మళ్లీ విధుల్లో చేరతామంటే నిబంధనలు అంగీకరించబోవని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యను ముగించేందుకే మంత్రివర్గాన్ని సమావేశపరుస్తున్నట్లు స్పష్టం చేసిన సర్కార్... అవసరమైతే శుక్రవారం కూడా భేటీ కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థలో మార్పులు చేస్తూ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో సగం బస్సులే ఉండేలా 5100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతులు ఇచ్చేందుకు ఇప్పటికే తీర్మానించిన కేబినెట్... విధివిధానాల రూపకల్పన సహా ఇతర బాధ్యతలను రవాణాశాఖకు అప్పగించింది. ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా ఎంపిక చేసిన మార్గాలను జాతీయం నుంచి మినహాయిస్తూ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత అనుమతులు ఇస్తారు. దీంతో ఆర్టీసీలో బస్సుల గణనీయంగా తగ్గనుంది. అపుడు ప్రస్తుతం ఉన్న 49వేల మంది సిబ్బంది సేవలు సంస్థకు అవసరం ఉండదు. అపుడు ఉద్యోగులు, సిబ్బందిని ఎలా తగ్గిస్తారన్నది ప్రశ్న. ఇందుకోసం ఏం చేస్తారు... ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్న విషయమై విభిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్భంద లేదా స్వచ్చంద పదవీవిరమణ అమలు చేయవచ్చన్న వాదన ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో ఏముందన్నది తేలాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కార్మిక శాఖ కమిషనర్ సమ్మెకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్మిక న్యాయస్థానానికి నివేదించాలా వద్దా అన్నది తేల్చాల్సి ఉంది. కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తే పరిష్కారం కోసం చాలా సమయం పడుతుందని అంటున్నారు. కార్మిక న్యాయస్థానానికి నివేదించకుండా ప్రక్రియను పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రందించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో ఇపుడు సర్కార్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రేపటి మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కేబినెట్ కోసం చేయాల్సిన కసరత్తుపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఆర్టీసీ పరిస్థితి, ఆర్థిక స్థితిగతులతో పాటు కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రివర్గ సమావేశం కోసం సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అన్ని వివరాలను మంత్రివర్గం ముందు ఉంచి ఆర్టీసీ సమస్యను ముగించే దిశగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఓ నిర్ణయానికి రానున్నారు.
Last Updated : Nov 27, 2019, 7:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.