హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. టెంట్ హౌజ్‌లో పనిచేసే పని పిల్లలను చితకబాదారు. ఆదివారం మధ్యాహ్నం బల్కంపేట పరిసరాల్లో నివాసముండే కొంతమంది దేవాలయంలో బోనం పండుగను నిర్వహించుకున్నారు.
వీరు 500 రూపాయలకు స్థానికంగా టెంట్ సామగ్రిని అద్దెకు తీసుకున్నారు. అనంతరం అద్దె చెల్లించడానికి నిరాకరించి...రాత్రి మద్యం మత్తులో షాపులో పనిచేసే వారిని చితకబాదినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ గౌడ్, బాబా, లక్ష్మణ్ తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు.