ETV Bharat / sports

ఈ దశాబ్దంలో అత్యధిక వికెట్ల వీరుడిగా అశ్విన్ రికార్డ్​ - అశ్విన్ మేటి బౌలర్

రవిచంద్రన్ అశ్విన్ ఈ దశాబ్దంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 564 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

R Ashwin finishes with most international wickets this decade
రవిచంద్రన్ అశ్విన్
author img

By

Published : Dec 25, 2019, 6:01 AM IST

అరంగేట్ర టెస్టులోనే 5 వికెట్లు.. అదే సిరీస్​లో శతకంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'​... వేగంగా 300 వికెట్లు తీసిన మైలురాయి.. ఈ రికార్డులు సాధించింది ఎవరో కాదు.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ దశాబ్దంలో అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్లు (564) తీసిన బౌలర్​గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.

అశ్విన్.. అత్యధిక వికెట్లు

2010 జనవరి నుంచి ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 564 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు అశ్విన్. టెస్టుల్లో 362, వన్డేల్లో 150, టీ20ల్లో 52 వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్ 535, స్టువర్ట్ బ్రాడ్ 525 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్​ సౌథి, ట్రెంట్ బౌల్ట్ కూడా టాప్-5లో చోటు దక్కించుకున్నారు.

R Ashwin finishes with most international wickets this decade
రవిచంద్రన్ అశ్విన్

అరంగేట్ర టెస్టులోనే 5 వికెట్లు..

2011లో వెస్టిండీస్​పై అరంగేట్రం చేసినప్పటి నుంచి అశ్విన్ వికెట్ల దాహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పొడి పిచ్​లపై తన స్పిన్ మయాజాలంతో బ్యాట్స్​మెన్​ను తికమక పెడతాడు. అరంగేట్ర టెస్టులో 5 వికెట్లు తీసిన ఏడో భారత క్రికెటర్​గా ఈ చెన్నై బౌలర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అదే సిరీస్​లో శతకంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు కూడా దక్కించుకున్నాడు.

వేగంగా 300 వికెట్ల మైలురాయి

టెస్టుల్లో వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్​గా అశ్విన్ ఘనత సాధించాడు. 70 టెస్టుల్లో 25.37 సగటుతో 362 వికెట్లు తీశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో ఏడాది విరామం తర్వాత జట్టులోకి వచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో 7/145 గణాంకాలతో 27వ సారి 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్​కు దూరం

భారత టెస్టు జట్టులో రెగ్యులర్ బౌలర్​గా ఉన్న అశ్విన్.. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడట్లేదు. 2017లో వెస్టిండీస్​ పర్యటనలో అశ్విన్​ స్థానంలో కుల్దీప్ యాదవ్​, యజువేంద్ర చాహల్​ను తీసుకుంది జట్టు యాజమాన్యం. అశ్విన్ చివరగా 2017 జూన్​లో విండీస్​తో ఆడాడు.

2014లో భారత ప్రభుత్వం 'అర్జున' అవార్డుతో అశ్విన్​ను సత్కరించింది. 2016లో ఐసీసీ 'క్రికెటర్​ ఆఫ్ ద ఇయర్', ఐసీసీ 'టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'​గా ఎంపికయ్యాడు. ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టులో విరాట్ కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. విస్​డెన్ టెస్టు టీమ్ ఈ జట్టును ప్రకటించింది.

ఇదీ చదవండి: అనారోగ్యంతో స్టోక్స్ తండ్రి.. సఫారీలతో తొలి టెస్టుకు అనుమానం

Viral Advisory
Tuesday 24th December 2019
ALPINE SKIING: Filip Zubcic comes to the end of his second run, but has to avoid an official walking across the finish line. Already moved.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.