టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శుక్రవారం మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇండోర్ వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో 30 పరుగులు చేసిన కోహ్లీ కెప్టెన్‌గా 10,999 అంతర్జాతీయ పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో మరొక్క పరుగు చేస్తే కెప్టెన్‌గా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆరో క్రికెటర్‌గా నిలుస్తాడు. టీమిండియా తరఫున మహేంద్రసింగ్ ధోనీ ఒక్కడే ఇదివరకు ఈ ఘనత సాధించాడు.
పుణెలో జరిగే తుది పోరులో భారత్ గెలిస్తే 2-0తో సిరీస్ వశమవుతుంది. టీమిండియా ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌కు ప్రయోగాలు చేసే పనిలో నిమగ్నమైంది.
గత మూడు సిరీస్‌ల్లో రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమైన సంజు శాంసన్, మనీశ్ పాండేలకు అవకాశమిచ్చేందుకు టీమిండియా తంటాలు పడుతుండగా కెప్టెన్ కోహ్లీ రెండో టీ20 అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే పొట్టి ప్రపంచకప్ సందర్భంగా భవిష్యత్‌లో ఎవరూ ఊహించని విధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే ఆలోచనను వ్యక్తం చేశాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో పేస్‌తో పాటు బౌన్స్ కూడా ఉంటుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఇవీ చూడండి.. టీ20ల్లో బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు