ETV Bharat / sports

టీ20ల్లో బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు

టీమిండియా ప్రధాన పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. శుక్రవారం లంకతో మూడో టీ20లో మరో వికెట్​ తీస్తే.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా అవతరిస్తాడు. సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న అశ్విన్​, చాహల్​ను వెనక్కినెట్టేస్తాడు.

India vs Sri Lanka T20: Pacer Jasprit Bumrah One Wicket Away to Set Become India's Leading Wicket-taker in T20Is
టీ20ల్లో బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు
author img

By

Published : Jan 9, 2020, 7:54 PM IST

భారత స్టార్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా.. నాలుగు నెలల విరామం తర్వాత ఇటీవలె మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు. ఇండోర్​ వేదికగా లంకతో జరిగిన మ్యాచ్​లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్​లో ఒక్క వికెట్​ మాత్రమే తీసిన బుమ్రా.. పరుగులు కట్టడి చేయడంలో కాస్త విఫలమయ్యాడు. డెత్​ ఓవర్లలో స్పెషలిస్ట్​ అయిన ఈ పేసర్.. ఆఖరి ఓవర్​లో చివరి మూడు బంతులకు 3 ఫోర్లు సమర్పించుకున్నాడు. మళ్లీ లయ అందుకుని ప్రత్యర్థికి వణుకు పుట్టించాలని ప్రాక్టీస్​లో భారీగా శ్రమిస్తున్నాడు. బౌలింగ్​ కోచ్​ భరత్​ అరుణ్​ ఇతడిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. అయితే శుక్రవారం మూడో టీ20 ముంగిట బుమ్రాను మరో రికార్డు ఊరిస్తోంది.

ఒక్క వికెట్​ దూరంలో...

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా నిలిచేందుకు వికెట్​ దూరంలో ఉన్నాడు బుమ్రా. ప్రస్తుతం అశ్విన్‌, చాహల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముగ్గురూ 52 వికెట్లు సాధించారు. గత మ్యాచ్​లో జట్టుతోనే దాదాపు మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది టీమిండియా. ఇదే జరిగితే చాహల్​కు ఈ రికార్డు అందుకునే వీలుండదు. లేదంటే బుమ్రా, చాహల్​ మధ్య పోటీ ఉంటుంది.

అశ్విన్‌ 46 టీ20 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు సాధించగా... బుమ్రా 44, చాహల్​ 36 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ అందుకున్నారు.

ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్​ కోసం భారత్​లో పర్యటిస్తోంది లంక జట్టు. ఇప్పటికే వర్షం కారణంగా తొలి మ్యాచ్​ రద్దవగా.. రెండో మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది టీమిండియా. ఫలితంగా 1-0 ఆధిక్యంలో ఉంది. పుణె వేదికగా శుక్రవారం జరగనున్న ఆఖరి మ్యాచ్​లో లంకేయులను ఓడించి ట్రోఫీ గెలవాలని చూస్తోంది కోహ్లీసేన.

Bhopal (Madhya Pradesh), Jan 09 (ANI): Bhopal NGO 'Gauravi' is helping women getting empowered. They are providing training to women to drive e-rickshaws. These women are mostly victims of domestic violence. The initiative was started by Reena Malviya. She along with NGO 'Gauravi' is working for last 5 years for women empowerment.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.