పూజా హెగ్డే.. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ అయిపోయింది. ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' అంటూ వచ్చి, అభిమానుల్ని మెప్పిస్తోంది.
అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన చిత్రాలన్నీ, సదరు హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. వీటిన్నింటిలో పూజ.. అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది. డార్లింగ్ ప్రభాస్‌తో 'జాన్'తోపాటు అక్కినేని అఖిల్ సరసన ప్రస్తుతం నటిస్తోంది.
అరవింద సమేత-ఎన్టీఆర్
ఇందులో ఎన్టీఆర్‌తో జోడీ కట్టింది పూజా. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచింది. తారక్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహర్షి-మహేశ్‌బాబు
రైతుల కథతో వచ్చిన ఈ చిత్రం.. విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో పూజా హెగ్డే తన నటనతో ఆకట్టుకుంది. మహేశ్ కెరీర్లో ఎక్కువ కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రంగస్థలం-రామ్‌చరణ్
ఇందులో పూర్తిస్థాయి పాత్రలో కనిపించకపోయినా, 'జిగేల్ రాణి' అంటూ అలరించింది. రామ్‌చరణ్‌తో కలిసి మాస్ బీట్‌కు చిందులేసి, అలరించింది. చరణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అల వైకుంఠపురములో-అల్లు అర్జున్
బన్నీ-పూజా.. ఇంతకు ముందు 'డీజే' సినిమా కోసం కలిసి పనిచేశారు. సాధారణంగా ఓ హీరోయిన్‌తో రెండోసారి కలిసి పనిచేయని అల్లు అర్జున్.. ఈ చిత్రం కోసం పూజాకు అవకాశమిచ్చాడు. హిట్ కొట్టి, కలెక్షన్లు సాధిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: