నటిగా వెండితెరపై, వ్యాఖ్యాతగా బుల్లితెరపై అలరించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మంచు లక్ష్మీ. వీటికే పరిమితం కాకుండా మారుతున్న రోజుల్ని అనుసరిస్తూ వెబ్‌సిరీస్‌లోనూ అడుగుపెట్టింది. గతంలో 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే సిరీస్‌లో నటించింది. ఇప్పుడు మరో ఆసక్తికర సిరీస్‌లో నటించబోతుందని వినిపిస్తోంది చిత్ర సీమలో.
'పెళ్లి చూపులు' ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సిరీస్‌లో నటించనుందట లక్ష్మీ. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. గతంలో తరుణ్ తీసిన 'సైన్మా' అనే లఘు చిత్రం చూసిన లక్ష్మీ.. అతడితో ఓ సినిమా చేయాలనుకుందట. ఈ నేపథ్యంలో 'పెళ్లి చూపులు' చిత్రానికంటే ముందు తరుణ్ దర్శకత్వంలో లక్ష్మీ నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదని, ఈ కాంబినేషన్ ఇన్నేళ్లకు కుదురుతుందని టాలీవుడ్ టాక్.
ఇవీ చూడండి.. 'తర్వాతి చిత్రం ఆయనతోనే.. ప్రశాంత్‌తో కాఫీ తాగా'