అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో లేఖ అందినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. అగ్రరాజ్యంతో అణు చర్చలు పునరిద్ధరించాలంటే మాత్రం తమ డిమాండ్లకు ఒప్పకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ట్రంప్-కిమ్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉన్నయని.. అయితే బర్త్‌డే విషెస్ చెప్పి అణు చర్చలు జరపాలనుకుంటే మాత్రం పొరపాటేనని స్పష్టం చేసింది.
జనవరి 8న కిమ్ పుట్టినరోజున అమెరికా నుంచి లేఖ వచ్చినట్లు ఉత్తరకొరియా విదేశాంగ సలహాదారు కిమ్కై గ్వాన్ వెల్లడించారు. తమ డిమాండ్లకు అమెరికా ఒప్పుకునే అవకాశమే లేనందున అణు చర్చల పునరుద్ధరణ సాధ్యమయ్యే అవకాశాలే లేవని స్పష్టం చేశారు.
2018 జూన్ నుంచి ట్రంప్-కిమ్ మధ్య అణునిరాయుధీకరణ అంశంపై మూడు సార్లు జరిగిన చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. గతేడాది ఫిబ్రవరిలో హనోయ్‌లో జరాగాల్సిన సమావేశం రద్దయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేటీకి సయోధ్య కుదరడం లేదు.
కిమ్‌తో తనకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని హనోయ్‌లో అర్థాంతరంగా రద్దయిన భేటీకి ముందు తెలిపారు ట్రంప్. తాము ప్రేమలో పడిపోయినట్లు చెప్పారు.
గతేడాది డిసెంబరులో జరిగిన పార్టీ సమావేశంలో అణు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఉత్తరకొరియా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు కిమ్. ఈ నిర్ణయం అమెరికా-ఉత్తరకొరియా మధ్య రెండేళ్లుగా జరుగుతున్న అణు చర్చల పురోగతికి కేంద్రమని నిపుణులు భావించారు.
ఇదీ చూడండి: మోదీతో దీదీ భేటీ.. పౌర చట్టం ఉపసంహరణకు విజ్ఞప్తి