చైనాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 361కి చేరింది. ఇది 2002-03లో చైనాలో వ్యాపించిన 'సార్స్' వైరస్ మృతులను మించిపోయింది. నిన్న ఉదయానికి 304 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 57 మంది బలయ్యారని చైనా అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజు కొత్తగా 2,829 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 17, 205 మందికి ఇప్పటివరకు ఈ వైరస్ సోకింది. మారుతున్న గణాంకాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెల్లడిస్తోంది.
ఇదీ చదవండి: దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం