ETV Bharat / city

కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం - telangan governament take precautions

కరోనా వైరస్​ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టి... పరీక్షలు చేసి పంపిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. నగరంలో అనుమానితుల శాంపిళ్లు వైరాలజీ ల్యాబ్​కు పంపించారు.

కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం
కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : Jan 27, 2020, 10:17 PM IST

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి... వైద్య పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా... నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 30 పడకలతో ఏడో వార్డు(ఐసోలేషన్​)ను 'కరోనా' అనుమానితుల కోసం సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్​ కె. శంకర్ తెలిపారు.

నగరంలో ఐదుగురికి కరోనా వైరస్​ సోకినట్లు అనుమానంతో... ముగ్గురి నుంచి శాంపిళ్లు సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్​కు పంపించారు. ఇద్దరికి సంబంధించి నెగిటివ్​ వచ్చింది. వారిద్దరిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. మరొకరి రిపోర్టు రావాల్సి ఉంది. అప్పటి వరకు వారిని ఆసుపత్రిలోనే ఉంచనున్నారు.

కేంద్రం నుంచి వచ్చిన కమిటీ సభ్యులు విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫీవర్​, గాంధీ ఆసుపత్రిని సందర్శించి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం జరగనుంది.

కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం

ఇదీ చూడండి: కరోనా కలకలం... హైదరాబాద్​లో కేంద్ర వైద్య బృందం

Intro:చైనా ను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏ మాత్రం వైరస్ లక్షణాలు ఉన్న వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు... దీనిలో భాగంగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి లో ఏడవ వార్డును (ఐసోలేషన్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్ధం చేసి పర్యవేక్షణ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ కే శంకర్ తెలిపారు ఈ వార్డులో 30 వరకు బెడ్ లను సిద్ధం చేసి పూర్తిస్థాయి అబ్జర్వేషన్లో ఉంచడానికి సిద్ధం చేశామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.. అయితే నగరంలో కి ఐదుగురు కరోనా వైరస్ సోకినట్లు అనుమానింతో వారి నుంచి ఇద్దరు శాంపిళ్లను సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించడం జరిగిందని తెలిపారు.... కాగా ఇద్దరికి నెగిటివ్ రావడంతో వాళ్ళని ఇప్పటికే డిశ్చార్జి చేసి పంపించి వేశామని మరో ఇద్దరిని అబ్జర్వేషన్లో పెట్టి అందులో ఒకరి శాంపిల్ ని మళ్లీ ఈరోజు పూణే పంపించామని అప్పటివరకూ వీరిని అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుందని తెలిపారు...
కాగా కేంద్రం నుండి రాష్ట్రానికి ఒక కమిటీ అబ్జర్వ్ చేయటానికి వచ్చిందని ఇప్పటికే ఎయిర్పోర్టులో పరిస్థితులను సమీక్షించిoదని దాంతోపాటు రేపు ఉదయం 11 గంటలకు ఫీవర్ హాస్పిటల్ మరియు గాంధీ హాస్పిటల్ సందర్శించి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తర్వాత ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం జరుగుతుందని తెలిపారు...
దీనిపై ప్రజలు కూడా ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని తెలిపారు
బైట్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపర్-ఇండెంట్----కె. శంకర్

Body:విజేందర్ అంబరుపేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.