ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లోని లోనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు.
లోనిలోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్ మౌలానా ఆజాద్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 40 ఏళ్ల పర్వీన్ సహా ఆమె కుమార్తెలు ఫాత్మా, సాహిమా, రతియా.. కుమారులు అబ్దుల్ అజీమ్, అబ్దుల్ అహాద్ మృతి చెందారు. వీరంతా 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలే కావడం స్థానికుల హృదయాలను కలచివేసింది.
ఇదీ చదవండి:కదులుతున్న రైలులో విన్యాసం- యువకుడి దుర్మరణం