ఆఫ్రికా చిరుతలు జీవించేందుకు అనువైన వాతావరణ ప్రాంతాన్ని ఎంచుకునేందుకు కేంద్రానికి అనుమతిచ్చింది సుప్రీం కోర్టు. అరుదైన భారతీయ చిరుతలు దాదాపుగా అంతరించినందున.. నమీబియా నుంచి ఆఫ్రికా చిరుతలను తీసుకువచ్చేందుకు అనుమతించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసింది.
దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.... నమీబియా నుంచి ఆఫ్రికా చిరుతలను తీసుకురావడానికి మార్గనిర్దేశం చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆఫ్రికా చిరుతను పెంచే ప్రదేశంపై తగిన సర్వే అనంతరం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే కోసం కూడా ఎన్టీసీఏకు ముగ్గురు సభ్యుల కమిటీ మార్గనిర్దేశం చేస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: మరిన్ని దేశాలకు 'కరోనా'- భారత్లో పెరిగిన కేసులు