ETV Bharat / bharat

'అధికార పక్షం ప్రయోజనాల కోసమే ఆ నివేదికలు!' - జాతీయ వార్తలు తెలుగు

ప్రభుత్వ నివేదికలు చాలా వరకు అధికార పార్టీ భావజాలంపై ఆధారపడే రూపొందుతాయని పలువురి భావన. కొన్నేళ్లుగా దేశంలో జరిగిన అంశాలను పరిశీలిస్తే ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. మూక దాడులు, భూ తగాదాలకు సంబంధించి అంశాలు తాజాగా విడుదలైన ఎన్​సీఆర్​బీ నివేదికలో కనిపించకపోవటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. అధికార పార్టీ ప్రయోజనాలు, ఆసక్తుల మేరకే ఈ నివేదికల రూపకల్పన జరుగుతోందన్న విశ్లేషణలకు ఊతమిస్తోంది.

crime rates in ncrb special
crime rates in ncrb special
author img

By

Published : Jan 20, 2020, 6:25 PM IST

Updated : Feb 17, 2020, 6:13 PM IST

కొద్ది సంవత్సరాలుగా అల్లర్లు, హింసాత్మక నేరాల గురించి మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే జాతీయ నేర పరిశోధన సంస్థ(ఎన్​సీఆర్​బీ)నివేదికల్లో వీటికి సంబంధించిన నేరాలు కనిపించట్లేదు. ఇలాంటి నివేదికలు అధికార పార్టీ ప్రయోజనాలు, భావజాలాన్ని అనుసరించి.. అందులో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయిస్తాయని ప్రతీతి.

2018లో నమోదైన వివరాల ప్రకారం తాజాగా 'భారత్​లో నేరాలు-2019' పేరిట నివేదిక విడుదల చేసింది ఎన్​సీఆర్​బీ. ఇందులో మైనారిటీలపై మూకదాడులు, గో సంరక్షణ పేరిట దాడులు వంటి విద్వేషపూరిత నేరాల వివరాలు ప్రధానంగా ఉండాల్సింది. విద్వేషాన్ని సంక్షిప్త సమాచారం ద్వారా వ్యాప్తి చేసే వాట్సాప్​ లాంటి సామాజిక మాధ్యమాలు ఈ తరహా దాడులకు కారణమయ్యాయి.

ఆ విభాగం మాయం!

2016 వరకు ఎన్​సీఆర్​బీ నివేదికలో 'వ్యవసాయ అల్లర్లు' అనే ప్రత్యేక విభాగం ఉండేది. 2014లో 628గా ఉన్న ఈ ఘర్షణలు.. ఆ తర్వాత ఊహించని స్థాయిలో పెరిగాయి. 2015లో 327 శాతం పెరుగుదల నమోదు చేస్తూ 2683కు చేరాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వైఫల్యానికి, వ్యవసాయ సంక్షోభానికి ఈ సంఖ్య అద్దం పడుతుందని కొందరి విశ్లేషణ. అంతటి కీలకమైన విభాగం తర్వాత నివేదికల్లో మాయమైంది. పెద్దగా పట్టించుకోని స్థాయిలో ఆ నేరాల సంఖ్య లేనందునే ఆ విభాగాన్ని తీసివేశామన్నది సాధారణంగా అధికారులు చెప్పే మాట.

రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు..

వ్యవసాయ రంగం చాలా సంక్లిష్టమైంది. రైతుల ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకోవటానికి ప్రభుత్వాలు చాలా పాట్లు పడ్డాయి. 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణల్లో వాణిజ్య సాగును ప్రోత్సహించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రాబడులను ఊహించి ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నారు. వర్షాల లేమి, ప్రకృతి వైపరీత్యాలు, కృత్రిమ మందుల ప్రభావంతో పంట దెబ్బతినడం.. అప్పులు పెరిగి రైతుల ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణమైంది.

2018 గణాంకాలు పరిశీలిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే నిరుద్యోగ యువత బలవన్మమరణాలు భారీగా పెరిగాయి. ఇది ఏ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదు. తాజా నివేదికల ప్రకారం 42 ఏళ్ల కనిష్ఠానికి నిరుద్యోగ స్థాయి పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్​సీఆర్​బీ ఎలా ఉంటుందోనని ఊహించుకుంటే వణుకుపుడుతోంది.

మహిళలపై నేరాలు..

ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చెందే మరో అంశం మహిళలపై నేరాలు. భారత్​లో 2018లో ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మొత్తం నమోదైన కేసులు 33,356. వీటిల్లో 94 శాతం బాధితులకు నిందితులు తెలిసిన వారే కావటం గమనార్హం. బయటపడని కేసులతో పోలిస్తే ఇవి చాలా తక్కువేనని విశ్లేషకుల అభిప్రాయం. బాధితులను సమాజం చూసే కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది పోలీస్​ స్టేషన్​కు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. అత్యాచారాలు ఎందుకు జరుగుతాయనే భిన్న దృక్పథంలో పోలీసులు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువ. ఇవన్నీ నివేదికల్లో ఉండాల్సిన అవసరం లేదా అన్నది పలువురి ప్రశ్న.

రాజకీయ వర్గంలో..

కొన్నేళ్ల క్రితం ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం సింగ్​ యాదవ్... తమ పార్టీకి చెందినవారిపై ఉన్న అత్యాచార కేసులను కొట్టివేయించారు. ఆ సమయంలో మగాళ్లు అంటే అలానే ఉంటారని ఆయన సమర్థించటం అత్యంత హేయం. మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా 2012లో జాతీయ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనా రాజకీయ వర్గాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఉన్నావ్​ ఘటనను పరిశీలిస్తే.. బాధితురాలి అలుపెరుగని పోరాటంతో మాత్రమే అధికారంలో ఉన్న నాయకునికి శిక్షపడింది. కానీ ఈ క్రమంలో ఆమె ఎన్నో కోల్పోయింది. యాదృచ్ఛికంగా ఈ ఘటన కూడా.. మహిళలపై నేరాలు అధికంగా జరిగే ఉత్తర్​ప్రదేశ్​లోనే కావటం గమనార్హం.

లఖ్​నవూ.. సాంస్కృతికంగా గొప్ప నగరం. కానీ మహిళల భద్రత విషయంలో అట్టడుగు స్థాయిలో ఉంది. అత్యాచార బాధితుల సంఖ్య మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లోనే ఎక్కువ. రాజకీయ అస్థిరత్వం, ఆధారాలు లేని మాఫియా పంచన ఉన్న పట్నా.. హత్యల్లో మెట్రో నగరాల్లోనే మొదటిస్థానంలో ఉంది. ప్రతి లక్షమందిలో 4.4 మంది హత్యకు గురవుతున్నారు. హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన నేరాల రేటులో మెరుగుదల సాధిస్తున్నామని బిహార్​ పోలీసులు ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.

నోట్ల రద్దు విజయవంతమేనా?

ఎన్​సీఆర్​బీ కాకుండా ఇతర నివేదికలను పరిశీలిస్తే.. నకిలీ కరెన్సీ ఆట కట్టించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే.. నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు 480 శాతం పెరిగాయని పలు పరిశోధన సంస్థలు వెల్లడించాయి. 2016లో ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు నకిలీలకు మరింత సాయపడింది. తక్కువ సంఖ్యలో ముద్రిస్తూ రెండు వేల నోట్ల చెలామణిని తగ్గించినా.. నకిలీ కరెన్సీలో రూ.2 వేల నోట్ల వాటా 56 శాతంగా ఉంది.

ఈ వైఫల్యాలను వదిలేస్తే.. నివేదికల ప్రకారం 2016 నుంచి క్రైం రేటు తగ్గుతూ వస్తోంది. 2013లో క్రైం రేటు 540 శాతంగా ఉంటే 2016లో 35 శాతం పడిపోయి 379.3కు చేరింది. 2018లో 388గా ఉంది. ప్రభుత్వ వివరాల ప్రకారం చూస్తే ఈ గణాంకాలు నిజమే అయినా వీటిని మరింత సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేరాల ప్రక్రియలో మార్పు కూడా రేటు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి చేసే బహుళ నేరాలను విస్మరించి ఘోరమైనవాటినే పరిగణనలోని తీసుకోవటం ఈ కోవకే వస్తుంది.

పరిశీలిస్తే వాళ్లు చెప్పిన అంశాలకన్నా దాచినవే ఎక్కువ అని స్పష్టమవుతుంది. ఈ విషయంలో వాళ్లు విజయవంతమయ్యారని చెప్పవచ్చు.

(రచయిత-సంజయ్​ కపూర్​)

ఇదీ చూడండి: 2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే పాక్​!

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/kerala-to-conduct-its-own-census-wont-implement-npr-finance-minister-thomas-isaac20200120172831/

Conclusion:
Last Updated : Feb 17, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.