కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్ పాలసీలో మోదీ సర్కార్ కొంత ఊరటనిచ్చింది. రూ.5 వేలకు మించి ఏదైనా కానుక రూపేణా స్వీకరిస్తేనే.. గ్రూప్-ఏ,బీ ఉద్యోగులు ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 1500గా ఉండేది.
గ్రూప్-సీ ఉద్యోగులు ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.2 వేలు దాటి బహుమతి తీసుకోకూడదు. ఇంతకుమందు ఈ పరిమితి రూ.500గా ఉండేది.
ప్రభుత్వ సీనియర్ అధికారులు అందరూ గ్రూప్-ఏ లోకి వస్తారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ప్రభుత్వ అధికారులు గ్రూప్-బీ లో ఉంటారు. క్లర్క్ స్థాయి ఉద్యోగులు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది గ్రూప్-సీ లోకి వస్తారు.
గిఫ్ట్లు అంటే ఏవి..?
అధికారిక సంబంధాలు లేని బంధువులు, దగ్గరి స్నేహితులు కాకుండా ఎవరి దగ్గరైనా రవాణా, ఆతిథ్యం లేదా ఇతర సేవలను పొందినా అవి గిఫ్ట్ పాలసీలోకి వస్తాయి. సాధారణ భోజనం, లిప్ట్, సామాజిక ఆతిథ్యం వంటివి గిఫ్ట్ పాలసీలోకి రావు.
విదేశీయుల నుంచి...
విదేశీ ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పొందే గిఫ్ట్ పాలసీలోనూ మార్పులు చేసింది. రూ.1000 పరిమితిని తొలగించింది.
"ద ఫారన్ కంట్రిబ్యూషన్ (ఏక్సప్టెన్స్ ఆర్ రిటెన్షన్ ఆఫ్ గిఫ్ట్స్ ఆర్ ప్రజెంటేషన్) రూల్స్ 2012లో చేసిన సవరణల ప్రకారం... భారత బృందంలోని ఉద్యోగి... విదేశీ ఉన్నతాధికారుల నుంచి ఇక బహుమతులు పొందవచ్చు.. లేదా ఇవ్వొచ్చు."
- సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ
ప్రభుత్వ ఉద్యోగులు... పెళ్లిళ్లు, పెళ్లిరోజులు, ఉత్సవాలు వంటి వాటికి ఆనవాయితీ ప్రకారం కానుకలు స్వీకరించవచ్చు. అయితే ఇవి అధికారిక సంబంధాలు లేని వ్యక్తి నుంచి, పరిమితులకు మించి స్వీకరిస్తే నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి తెలియజేయాలి.
- ఇదీ చూడండి: ఆ ప్రాంత ఉద్యోగులకు కేంద్రం తీపికబురు