గత ఐదేళ్లలో 320 మంది అవినీతి అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. 2020 జనవరి 30 వరకు వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు ఇచ్చిన వివరాల ప్రకారం... వివిధ కేడర్లకు చెందిన అవినీతి అధికారులకు అకాల పదవీ విరమణ ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు లోక్ సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
2014 జులై నుంచి 2019 డిసెంబరు వరకు 163 మంది గ్రూప్-ఎ, 157 మంది గ్రూప్-బి అధికారులను ఉద్యోగాల నుంచి తప్పించినట్లు తెలిపారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా ఉన్నారు.
ఈ కథనం చూడండి: రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్: మోదీ