ప్రఖ్యాత పర్యటక కేంద్రం.. కడప జిల్లాలోని గండికోటలో సాహస క్రీడల అకాడమీ అందుబాటులోకి వచ్చింది. నేలపై మాత్రమే కాకుండా.. నీటిలో, గాలిలో చేసే సాహస క్రీడల్లోనూ ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. ఇలాంటి వెసులుబాటు ఉన్న అకాడమీ.. దేశంలో ఇదే మొదటిదని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. మొదటి బ్యాచ్‌లో శిక్షణకు 104 మందిని ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే 28 మందికి తర్ఫీదు ఇచ్చామని ఇన్ఛార్జ్ శేఖర్ బాబు చెప్పారు. తనకు ఎవరెస్ట్‌తో పాటు పలు ఇతర శిఖరాలు అధిరోహించిన అనుభవం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: