ETV Bharat / state

గుజరాత్​లో రోడ్డుప్రమాదం.. ప్రకాశం జిల్లా వాసుల మృతి - గుజరాత్​లో రోడ్డుప్రమాదం ప్రకాశం జిల్లా వాసుల మృతి

సోమ్​నాథ్ తీర్థయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గుజరాత్​ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దేవపారాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఉప రాష్ట్రపతితో ఫోన్​లో మాట్లాడి.. మృతదేహాలను స్వగ్రామానికి చేర్చేలా చొరవ తీసుకున్నారు.

Road accident at gujarath five persons death
గుజరాత్​లో రోడ్డుప్రమాదం..ప్రకాశం జిల్లా వాసుల మృతి
author img

By

Published : Jan 22, 2020, 2:12 PM IST

గుజరాత్​లో రోడ్డుప్రమాదం..ప్రకాశం జిల్లా వాసుల మృతి

సోమ్​నాథ్ తీర్థయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గుజరాత్​ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దేవపారా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశంజిల్లా వాసులు మృతిచెందారు. జిల్లాలోని చీరాల మండలం జాండ్రపేటకు చెందిన కామిశెట్టి సుబ్రమణ్యం, రాజ్యలక్ష్మి, గణేష్, అఖిల్, దుర్గాభవాని ప్రమాదంలో అక్కడకక్కడే మృతి చెందగా... కుశలత, బొడ్డు నాగేంద్రం, రుషిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఫోన్​లో మాట్లాడారు. మృతదేహాలను స్వగ్రామానికి చేర్చేందుకు సహకరించారు. మాజీ మంత్రి పాలేటి రామారావు, తెదేపా నాయకులు జంజనం శ్రీనివాసరావు, స్థానికులు.. మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఇదీ చదవండి:

పాడేరు: ఆటో బోల్తా ఘటనలో... మరొకరు మృతి

Intro:
FILE NAME : AP_ONG_41_22_CHIRALA_KU_CHARUKUNNA_MRUTADAHALU_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ : గుజరాత్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలు వారి స్వగ్రామానికి చేరుకున్నాయి.. గుజరాత్ లొని సురేంద్రనగర్ జిల్లా దేవపారా గ్రామ సమీపంలొ జరిగిన రోడ్డు ప్రమాధంలొ ప్రకాశంజిల్లా చీరాల మండలం జాండ్రపేట కు చెందిన ఐదుగురు మృతిచెందగా మరో నలుగురి పరిస్దితి విషమంగా ఉంది ...సోమనాద్ యాత్ర ముగించుకుని అహమ్మదాబాద్ కు వాహనంలొ బయలుదేరారు...వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుకుతప్పి డివైడర్ కు ఢి కొని ఎదురుగా వస్తున్నవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది... ప్రమాధంలొ కామిశెట్టి సుబ్రమణ్యం, రాజేశ్వరి, గణేష్, అఖిల్, దుర్గాభవాని లు అక్కడకక్కడే మృతిచెందారు..... తీవ్రగాయాలైన మరో ముగ్గురు కుశలత, బొడ్డు నాగేంద్రం, రుషిక్ ఆసుపత్రిలో చికిస్సపోందుతున్నారు.. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జాండ్రపేటలొ విషాదచాయలు అలముకున్నాయి...విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఫోను లో మాట్లాడి మృతదేహాలను స్వగ్రామానికి చేరేందుకు సహకరించారు.. చీరాల కు నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో చేరుకున్న మృతదేహాలకు మాజీమంత్రి పాలేటి రామారావు, తెదేపా నాయకులు జంజనం శ్రీనివాసరావు, స్థానికులు సందర్శించి నివాళులు అర్పించారు. యాత్రకు వెళ్ళేటప్పుడు సంతోషంగా తమకు చెప్పి వెళ్లారని...ఇప్పుడు విగతాజీవులుగా ఇంటికి రావటం తమను కలచివేస్తుందని కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించారు

..Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.