పల్లెల్లో వ్యవసాయ సేవలు అందించేందుకు వ్యవసాయ శాఖ కొత్తగా.. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను ఈ కేంద్రాల ద్వారానే నేరుగా రైతులకు అందించనున్నారు. ఎరువులు, విత్తనాలు, నూతన వ్యవసాయ పరికరాలపై సలహాలు వంటి సేవలను ఇక్కడి నుంచే అందించనున్నారు. తొలి విడతలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి ఐదు చొప్పున భరోసా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని గ్రామాల్లో అద్దె భవనాల్లో కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: