నెల్లూరులో వేమాలశెట్టిబావి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. రామ్నగర్ ప్రాంతంలో వెలసిన శ్రీవైద్య వీరరాఘవస్వామి ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రతిఏటా త్రై అమావాస్యనాడు జరుగుతాయి. వైద్య వీరరాఘవస్వామి ఆలయం తిరువళ్ళూరు తర్వాత దేశంలోనే రెండో పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు వేమాలశెట్టిబావి దగ్గర పూజలు నిర్వహిస్తారు. బావిలో పసుపు, కుంకుమ, బెల్లం వేసి మొక్కులు తీర్చుకుంటారు.
ఇదీ చదవండి: