నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్తో కలిసి సందర్శించారు. విశిష్ట అధ్యయన కేంద్రం గురించి వారికి ఉపరాష్ట్రపతి వివరించారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్టులో ఏర్పాటు చేసిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర ముగింపు సభకు హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కేంద్ర మంత్రి మాటల్లో...
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెంకయ్య నాయుడుతో తనకు గల సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని వెంకయ్యనాయుడు తరచూ ఆలోచిస్తాంటారని తెలిపారు. పేద విద్యార్ధులకు విద్యనందించేందుకు స్వర్ణ భారత్, అక్షర విద్యాలయం కోసం కృషి చేస్తున్న వెంకయ్యనాయుడు కుటుంబాన్ని ప్రశంసించారు. దేశంలోని నలుమాలల నుంచి వచ్చిన విద్యార్ధులు ఇక్కడ చదువుతుండటం ఆనందంగా ఉందన్నారు. 2008 నుంచి ఉన్న డిమాండ్.. మైసూరు నుంచి తెలుగు అధ్యయన కేంద్రం ఇక్కడకు తీసుకు రావడంలో వెంకయ్య నాయుడు సఫలీకృతులయ్యారన్నారు.
6 ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి...
భారతదేశం విభిన్న భాషల నిలయమని... ప్రధాని మోదీ సైతం మాతృ భాషలను రక్షించుకోవాలని సూచించారని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన 'తెలుగు భాష గొప్పతనం' పాట అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో సభ అలరించింది.
ఇదీ చదవండి:
అందరికీ మంచి జరగాలనే కార్పొరేషన్లు: సీఎం జగన్