నకిలీ మద్యం తయారుచేస్తున్న ముగ్గురు నిందితులను విజిలెన్స్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. గత నెల 30న కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుముల పాడులో రాంబాబు అనే వ్యక్తి.. ఇంట్లో నకిలీ మద్యం తయారుచేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి కారుతో పాటు స్పిరిట్... క్వాటర్ బాటీల్లు... మూతలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఎనిమిది లక్షలు ఉంటుందని డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు తెలిపారు. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్టు చేయాలన్నారు. వీరికి కర్ణాటక, తెలంగాణ నుంచి స్పిరిట్, మూతలు సప్లై చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ముఠాను పట్టుకుని నకిలీ మందును అరికడుతామన్నారు.
ఇదీ చదవండి :