స్తంభించిన కృష్ణాయపాలెం.. రోడ్డుపై బైఠాయించిన రైతులు - కృష్ణాయపాలెంలో మూడు రాజధానులు వద్దంటూ రైతుల ధర్నా
మూడు రాజధానులు వద్దంటూ కృష్ణాయపాలెంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతులు, రైతుకూలీలు రహదారి దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు. మూడు రాజధానులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.