నూతన సంవత్సరంలో పాత వేతన బకాయిలు అడిగే పరిస్థితి లేకుండా.. అన్ని రంగాల కార్మికులకు డిసెంబర్ నెలాఖరులోగా వేతన బకాయిలను చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్న గ్రీన్ అంబాసిడర్ల (హరిత రాయబరుల) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హరిత రాయబారులు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం హరిత రాయబారుల పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 8న దేశవ్యాప్తంగా కార్మికుల బంద్‌తో తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: