విశాఖ జిల్లా నక్కపల్లిలో హైవేపై లారీ టైర్ ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. నక్కపల్లికి చెందిన గింజాల సన్యాసమ్మ రోడ్డు దాటి కొళాయి వద్ద నీరు పట్టుకుని తిరిగి వస్తుండగా.. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ నుంచి టైర్ విడిపోయి సన్యాసమ్మని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: