కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో ఓ రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన మోటుపల్లి బుజ్జి పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను చనిపోయాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా గత నెల రోజుల్లో వరి కోతల వల్ల ఈ ప్రాంతంలో పాము కాట్లు పెరిగాయి.
ఇదీ చూడండి: