కృష్ణా జిల్లా గుడివాడలో వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం ధారగా కారుతోంది. ఈ విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రెల్లిబజారులో ఉన్న గంగానమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న వేప చెట్టుకు రాత్రి నుంచి పాలు ధారాళంగా వస్తున్నాయి. ఈ వింతను చూసేందుకు ప్రజలు వస్తున్నారు. పూజలు చేసి ఆ పాలను తీర్థ ప్రసాదాలుగా స్వీకరిస్తున్నారు. పాలు కారే దృశ్యాలను తమ చరవాణీలలో బంధిస్తున్నారు యువత.
ఇవీ చదవండి...పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!