ETV Bharat / state

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయొచ్చా? - kanakamedala comments on faremers protest

సీఎం మూడు రాజధానుల ప్రకటనపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్​ మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలు రాజధాని ప్రాంత రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయని అన్నారు. రైతుల ఆందోళనను మంత్రులు అవహేళన చేయడం వారి అహంకారానికి నిదర్శనమని తెలిపారు.

'సీఎం మూడు రాజధానుల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం'

author img

By

Published : Dec 20, 2019, 2:40 PM IST

మంత్రులపై తెదేపా ఎంపీ కనకమేడల విమర్శలు

రాష్ట్ర రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్​ అన్నారు. అప్పట్లో అమరావతిని జగన్​ సమర్థించారని గుర్తు చేశారు. జీఎన్​రావు కమిటీకి చట్టబద్ధమైన అధికారం లేదన్న ఆయన.. కమిటీ నివేదికను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడారని ఆరోపించారు. సీఎం అలా ప్రవర్తించడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. ఉద్యమం చేసే రైతులను మంత్రులు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళన ఊరికే పోదన్న కనకమేడల రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. సీఎం ప్రకటన వల్ల ప్రజలు, రైతులు గందరగోళానికి గురవుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి 3 రాజధానులు కాదు... 30 రాజధానులు పెట్టాలని ఎద్దేవా చేశారు. సీఎం ప్రకటన కేవలం తెదేపా అధినేత చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యగా ఉందని వాపోయారు. జగన్​ తీరు మార్చుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:

ఆగని రైతుల ఆందోళనలు.. తుళ్లూరులో రహదారిపై వంటావార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.