.
ఆగని రైతుల ఆందోళనలు.. తుళ్లూరులో రహదారిపై వంటావార్పు - తుళ్లూరులో రహదారిపై రైతులు వంటావార్పు వార్తలు
మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో మూడవ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
thullur darna in amaravathi
.