అక్రమ సంబంధం మానేయాలన్న కుమారుడిని కన్నతల్లి ప్రియుడి సాయంతో అంతమొందించింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగుకు చెందిన రాణికి సత్యనారాయణతో వివాహమైంది. కొద్ది రోజులకే రాణికి బాలస్వామితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత 20 ఏళ్లుగా వీరిద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రాణి కుమారుడు హార్దిక్ రాయి వివాహేతర సంబంధానికి దూరంగా ఉండాలని తల్లిని హెచ్చరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న తల్లి... ప్రియుడు బాలస్వామితో కలిసి కొడుకుని చంపటానికి పథకం వేసింది. గత నెల 19వ తారీఖున బాలస్వామి.... హార్దిక్‌ని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని పొలానికి తీసుకెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న తాడుతో హార్ధిక్ రాయ్ మెడకు ఉరివేసి.. గట్టిగా బిగించడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని మంగళగిరి మండలం గుంటూరు కాలవ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: