మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతి నగరంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులిపర్తి నాని ఇంటి నుంచి తణపల్లి జాతీయ రహదారి వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం.. ఓకే రాజధాని అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని... చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ తోపులాటలో కొందరి కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతియుత నిరసన తెలుపుతున్న తమని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ అన్నారు. శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నివిపివేశాలో.. ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా