కనుమ పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కైలాస గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసిన సోమస్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతామూర్తులకు ఆహ్వానించటం కైలాసగిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం అనవాయితీగా వస్తోంది. స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు.
ఇదీ చదవండి: