నచ్చిన క్రికెటర్లపై అభిమానాన్ని వైవిధ్య రీతిలో వ్యక్తపరుస్తుంటారు అభిమానులు. ఇటీవలే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేరు, జెర్సీ నెంబర్‌ను ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకున్న ఓ వ్యక్తిని మరువక ముందే.. తాజాగా మరో ఫ్యాన్ వినూత్నంగా విరాట్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. చరవాణిలతో కోహ్లీ బొమ్మను రూపొందించి అతడి చేత అభినందనలు అందుకున్నాడు.
అసోం గుహవటికి చెందిన రాహుల్ పరేక్ మొబైల్ ఫోన్లు, వైర్ల సాయంతో విరాట్ బొమ్మను రూపొందించాడు. మూడు రోజుల్లోనే ఈ పని పూర్తి చేశాడు. అతడి అభిమానానికి ముగ్ధుడైన కోహ్లీ.. ఆటోగ్రాఫ్ ఇచ్చి అభినందించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
-
Making art out of old phones.
— BCCI (@BCCI) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD
">Making art out of old phones.
— BCCI (@BCCI) January 5, 2020
How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGDMaking art out of old phones.
— BCCI (@BCCI) January 5, 2020
How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD
"పాత చరవాణిలు, వైర్లతో కోహ్లీ కళాఖండాన్ని రూపొందించా. ఇందుకు మూడు రోజుల సమయం పట్టింది. నా కళను మెచ్చి విరాట్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. విరాట్‌ను కలిసేటప్పుడు ఆనందంతో నా గుండె వేగం పెరిగింది. శ్రీలంకతో సిరీస్ కోసం కోహ్లీ గుహవటి వస్తాడని కొన్ని నెలల ముందే తెలిసింది." -రాహుల్ పరేక్, కోహ్లీ అభిమాని.
గుహవటి వేదికగా శ్రీలంకతో తొలి మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ నెల 7న ఇండోర్‌లో రెండో టీ20 జరగనుంది. ఈ నెల 10న పుణె వేదికగా ఆఖరి టీ20 నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: ఇర్ఫాన్ కెరీర్ ముగియడానికి కారణమేంటో తెలుసా?