విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఓ ఉపాధ్యాయిని దారుణ హత్యకు గురైంది. ఆస్తి తగాదాలతో ఆమెను భర్తే రోకలి బండతో కొట్టి చంపాడు. పట్టణ౦లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెక్కా నగర్లో నివాసముంటున్న కె. మేరీ కమలక్ష్మి, శోభన్రాజు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కమలక్ష్మి సమీప నాగ నరసింహ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేస్తున్నారు. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. బుధవారం గొడవపడిన సమయంలో సంయమనం కోల్పోయిన భర్త ఆమెను రోకలిబండతో మోదాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: