ETV Bharat / city

ఆర్టీసీ ఉద్యోగులకు ఆ పాస్​లు రద్దు

ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడికైనా కుటుంబంతో సహా బస్సుల్లో వెళ్లేందుకు వీలుగా ఏడాదికి 3 సార్లు ఇచ్చే పాస్‌లు ఇకపై ఉండవు. ఈ పాస్‌ల జారీని తొలగిస్తున్నారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎల్టీసీ) అమలు చేయనున్నారు.

rtc bus employees special passes cancel
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక పాస్​లు రద్దు
author img

By

Published : Jan 20, 2020, 6:46 AM IST

ఈ నెల ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వంలో విలీనమై, ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మారడంతో.. వారికి ప్రభుత్వ సర్వీస్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిపై చర్చించేందుకు ఆర్టీసీ పాలక మండలి నేడు సమావేశం కానుంది. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఏయే నిబంధనలు అమలు చేయాలనే దానిపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి ఆధారంగా ప్రభుత్వ సర్వీసు నిబంధనలన్నింటినీ ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో ఆమోదించనున్నారు.

వాటిలో కొన్ని అంశాలు..

* పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్టీసీ ట్రస్ట్‌ ద్వారా చెల్లించే సిబ్బంది పదవీ విరమణ ప్రయోజన పథకం (ఎస్‌ఆర్‌బీఎస్‌), ఉద్యోగి చనిపోతే రూ.1.5 లక్షలు అందజేసే ఉద్యోగి ప్రయోజన థ్రెఫ్ట్‌ పథకం (ఎస్బీటీఎస్‌) రద్దవుతాయి. వీటి కోసం ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా తీసుకునే కొంత మొత్తాన్ని ఈ నెల నుంచి తీసుకోరు.
* ఆర్టీసీలో ఇప్పటి వరకు ఉన్న ఈపీఎఫ్‌-95ను ప్రస్తుతానికి కొనసాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు అమలుపై నిర్ణయం తీసుకుంటారు.
* పీఆర్సీ సూచనలతో ఆర్టీసీ ఉద్యోగుల పే స్కేల్స్‌ ఖరారు చేస్తారు.
* ఆర్టీసీలో ఉండే వైద్యసేవల విధానం రద్దవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే వైద్య సేవల విధానం అమల్లోకి వస్తుంది.
* కార్మిక సంఘాలు ఉండవు. ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే ఉద్యోగుల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సమ్మె చేయడం ఇకపై కుదరదు.

సౌకర్యాలు తొలగిస్తే ఉద్యమిస్తాం: ఈయూ

ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీలో 60 ఏళ్లుగా కార్మికులకు ఉన్న సౌకర్యాలను తొలగిస్తే అన్ని సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వేలో ట్రేడ్‌ యూనియన్లు ఉన్నాయని, ప్రజా రవాణాశాఖలోనూ వీటిని కొనసాగించాలని కోరారు.

ఇదీ చూడండిఅమరావతిలో పునాది గట్టిదే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.