ఇదీ చదవండి : రేషన్ కార్డులు, పింఛన్లలో అనర్హుల గుర్తింపు
విజయవాడలో ఆర్ఎస్ఎస్ పథసంచలనం... - ఆర్ఎస్ఎస్ పథ సంచలన వార్తలు
సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ మహానగర పథసంచలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నగర వీధుల్లో కార్యకర్తలు పథ సంచలనం చేశారు.
విజయవాడలో ఆర్ఎస్ఎస్ పథ సంచలనం నిర్వహణ
మంచి నడవడిక గల వ్యక్తులను తయారుచేయడం ద్వారా సమసమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కర్తవ్యమని లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది అన్నారు. విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్ మైదానంలో నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ మహానగర పథసంచలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ధ్వజారోహణతో పథ సంచనలం ప్రారంభించిన నిర్వాహకులు....అనంతరం సంఘ్ ప్రార్థన ద్వారా యువకులను చైతన్యపరిచారు. అనంతరం 4 బృందాలుగా సంఘ్ కార్యకర్తలు నగరంలో పథ సంచలనం చేశారు. వెన్యూ కన్వెన్షన్ మైదానం నుంచి ప్రారంభమైన పథ సంచలనం లయోలా కళాశాల, రమేష్ ఆసుపత్రి మీదుగా సాగింది.
ఇదీ చదవండి : రేషన్ కార్డులు, పింఛన్లలో అనర్హుల గుర్తింపు
sample description