ETV Bharat / city

బెజవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు - news on flight services from vijayawada

విజయవాడ నుంచి ఒకే రోజు నాలుగు విమాన సర్వీసులు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 27 నుంచి సర్వీసులు నడిపేందుకు పౌరవిమానశాఖ నిర్ణయించింది. తిరుపతికి, విశాఖ సహా హైదరాబాద్‌కు రెండు కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు

బెజవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు
author img

By

Published : Oct 23, 2019, 4:40 PM IST

Updated : Oct 23, 2019, 5:43 PM IST

ఈ నెల 27 న విజయవాడ నుంచి 4 విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు. తిరుపతి, విశాఖ సహా హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి-విజయవాడ మధ్య రానున్న ఎయిర్ బస్ వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. విజయవాడ-విశాఖ విమాన సర్వీసు పునరుద్ధరిస్తామన్నారు.

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సహా సివిల్ ఏవియేషన్‌కు లేఖలు రాశామని... అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు మరింత సమయం పడుతుందన్నారు. జూలై 2020 నుంచి హజ్ విమానాలు విజయవాడ నుంచే నేరుగా బయల్దేరతాయన్నారు.

విజయవాడ విమనాశ్రయం నుంచి కొత్త సర్వీసులు

ఇదీ చదవండి

ఇసుక సరఫరాకు జేసీలు ప్రత్యేక దృష్టి సారించాలి: జగన్​

sample description
Last Updated : Oct 23, 2019, 5:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.