అమరావతి సమస్య పెద్దదికాక ముందే ముఖ్యమంత్రి జగన్ సమస్యను పరిష్కరించాలని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. 3 ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అన్ని ప్రాంతాలకూ లాభం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. రాయలసీమలో శీతకాల రాజధాని కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలన్నప్పుడు.. ఫ్రీ జోన్‌గా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. సచివాలయం పూర్తిగా విశాఖలోనే పెడితే ఒప్పుకోమని ఆయన అన్నారు. సచివాలయం విశాఖలో పెడితే.. రాయలసీమ ప్రజలు వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. 3 ప్రాంతాలకూ ప్రాధాన్యం ఇవ్వకుంటే మళ్లీ ఉద్యమాలు వస్తాయని టీజీ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ జరిగితేనే 3 ప్రాంతాలకూ న్యాయం జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి :