కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్నానని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబుకాదని పేర్కొన్నారు. స్వర్ణభారతి ట్రస్టులో రాజకీయాలు మాట్లాడకూడదనే నియమం పెట్టుకున్నామని వెంకయ్య తెలిపారు. రైతుల బాధలు, ఇబ్బందులు తనకు తెలుసన్న ఆయన... సమస్య పరిష్కరించేవారికి సమాచారం అందిస్తానన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చారన్న వెంకయ్యనాయుడు... రాష్ట్రాభివృద్ధి కోసం చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :