అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి బాధ్యులు తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాజధాని కోసం చేస్తోన్న తమ ఆందోళనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ఉద్యమానికి తెదేపా నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే రాజధాని తరలిపోదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితి చూసే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని ఉద్యమాన్ని జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి :