ETV Bharat / city

'ఉపసంహరించుకోండి... లేదంటే ఉద్యమిస్తాం' - amaravathi issue

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. పలు సంస్థలు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీగా ఏర్పడ్డాయి. బార్ అసోసియేషన్, విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు ఇందులో చేరాయి. అమరావతిని పరిరక్షించండి అనే నినాదంతో ఉద్యమిస్తామని సమితి సభ్యులు తెలిపారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు.

Amaravathi parirakshana samiti JAC formed
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటు
author img

By

Published : Dec 23, 2019, 11:52 PM IST

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటు

'అమరావతిని పరిరక్షించండి' అనే నినాదంతో బార్ అసోసియేషన్, ఇతర సంస్థలు కలిసి అమరావతి పరిరక్షణ సమితి జేఏసీని ఏర్పాటు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తాము వ్యతిరేకం కాదని సమితి సభ్యులు ప్రకటించారు. అమరావతిలో రాజధానిని నిర్మించేందుకు రైతులు 30 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిని నిర్మించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చటం సరికాదన్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించకూడదని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కర్నూలులో నూతన హైకోర్టును నిర్మించేందుకు కోట్ల రూపాయల ఖర్చవుతుందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరించాలని ..రాజధానిని మాత్రం అమరావతిలోనే ఉంచాలని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కోరింది. ప్రభుత్వం రాజధాని తరలింపుపై పునరాలోచించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

'అండగా ఉంటాం...ఆందోళన విరమించండి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.