Man Dragged By Car : ట్యాక్సీ డ్రైవర్​ను కిలోమీటర్​ లాక్కెళ్లిన కారు.. మృతదేహాన్ని వదిలేసి పరార్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 12:54 PM IST

Man Dragged By Car In Delhi :  ట్యాక్సీ డ్రైవర్​ను ఢీకొట్టి కిలోమీటర్​ మేర లాక్కెళ్లాడు ఓ కారు డ్రైవర్​. ఈ ప్రమాదంలో ట్యాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని దిల్లీలోని మహిపాల్​పుర్​లో జరిగింది. కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని పట్టించుకోకుండా అలానే కిలోమీటర్​ దూరం లాక్కెళ్లి.. ఓ చోట వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన దిల్లీ - గురుగ్రామ్​ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది. దీనిని అదే రోడ్డుపై వెళ్తున్న మరో ప్రయాణికుడు వీడియో తీయగా.. వైరల్​గా మారింది. మంగళవారం రాత్రి 11.20 గంటలకు తమకు సమాచారం వచ్చిందని నైరుతి దిల్లీ డీసీపీ మనోజ్​ తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా తీవ్ర గాయాలపాలై ఓ వ్యక్తి మృతి చెందాడని చెప్పారు. అనంతరం దర్యాప్తు చేయగా.. మృతుడు హరియాణా ఫరీదాబాద్​కు చెందిన బిజేందర్​గా తేలిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.