thumbnail

By

Published : Jun 21, 2023, 7:30 AM IST

Updated : Jun 21, 2023, 10:28 AM IST

ETV Bharat / Videos

Flyover Collapse in Hyderabad : సాగర్‌రింగ్‌రోడ్డు కూడలిలో కూలిన వంతెన

Flyover Collapse at Sagar Ring Road in Hyderabad : హైదరాబాద్​లో అర్ధరాత్రి సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ రింగు రోడ్డు వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప రాడ్లు ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 

"ఫ్లై ఓవర్ వేయడానికి కింద సపోర్ట్​గా ఇనుప రాడ్లు పెట్టే క్రమంలో చిన్న తేడా వచ్చి ప్రమాదం జరిగినట్లుగా ఉంది. బ్యాలెన్స్ లేక వంతెన పడిపోయింది. ఈ ఘటనలో కాంక్రీట్ వేసే ఒక ఇంజినీర్, కొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రమాదానికి గురైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. దీనిపై కేసు నమోదు చేశాం." అని ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ శ్రీధర్​రెడ్డి తెలిపారు.

Last Updated : Jun 21, 2023, 10:28 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.