Prathidwani : రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించిన 'కరెంట్' మంటలు - BRS protest over Revanth Reddy comments
🎬 Watch Now: Feature Video

BRS VS Congress on Free Electricity controversy : రాష్ట్ర రాజకీయాల్ని మరోసారి వేడెక్కేలా చేశాయి కరెంట్ మంటలు. రైతుల ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యల కేంద్రంగా రాజుకుంది.. ఈ దుమారం. సాగుకు 8 గంటల విద్యుత్ చాలని రేవంత్ అన్నారని బీఆర్ఎస్ భగ్గుమంటే.. ఆయన మాటల్ని గులాబీ దళం వక్రీకరిస్తోందంటూ తిప్పికొడుతోంది.. కాంగ్రెస్. ఎక్కడో అమెరికా పర్యటన ఉన్న రేవంత్ వ్యాఖ్యల రగడ ఇక్కడింకా కొనసాగుతునే ఉంది. మరీ.. వ్యవసాయ ఉచిత విద్యుత్ విషయంలో అసలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏం అన్నారు? ప్రస్తుత ఉచిత కరెంట్ అంశం ఒక్కటే కాదు.. కాళేశ్వరం నుంచి ప్రగతి భవన్, ధరణి వరకు కాంగ్రెస్ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ ఆగ్రహానికి కారణాలు ఏమిటి? ఈ కరెంట్ కాక రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రైతులకు ఉపయోగపడేందుకేనా ఈ రాజకీయ వేడి లేదా ఆ పార్టీ బలాలని పెంచుకునేందకా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.