prathidwani: రాష్ట్రంలో మరోసారి పతాకస్థాయికి రాజకీయం
🎬 Watch Now: Feature Video
Today Prathidwani: రాష్ట్రంలో మరోసారి రాజకీయ హైటెన్షన్ నెలకొంది. రాజకీయ నాయకుల మధ్య ఆరోపణల పరంపర కొనసాగుతోంది. ఈ ఆరోపణలు వల్ల రాష్ట్రంలో ప్రజలందరికి ఆశక్తి నెలకొంది. అయితే ఈసారి అధికార – విపక్షాల మధ్య కాక.. 2 విపక్షాల మధ్య నెలకొన్న ఘర్షణే ఈ స్థాయికి చేరడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనంతటికీ కారణం.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ సీనియర్ నాయకుడు.. ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్- బీఆర్ఎస్పై చేసిన రూ.25 కోట్ల ఆరోపణలు. ప్రతిగా భాగ్యలక్ష్మి అమ్మోరుపై ఒట్టేసి మరీ తమ తప్పే లేదని నిరూపించుకున్నాం.. అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరి ఆరోపణలు చేసిన ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదు? తప్పుడు ఆరోపణలు చేశారు అని భావిస్తే కాంగ్రెస్ లీగల్ చర్యల దిశగా ప్రొసీడ్ కాకుండా ప్రమాణాల మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.