టెస్ట్​ డ్రైవ్​ అని వచ్చి.. వాహనంతో ఉడాయించి.. - ఆస్ట్రేలియాలో లాన్​మూవర్​ దొంగతనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 14, 2021, 2:32 PM IST

దొంగలు దొంగతనం చేసే స్టైల్​ మార్చారు. ఎంచక్కా.. దర్జాగా కావాల్సింది కొట్టుకుపోతున్నారు. అలాంటి చోరీనే ఆస్ట్రేలియా క్వీన్స్​​లాండ్​ రాష్ట్రం కెయిర్న్స్​లో జరిగింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి పెరటిలో గడ్డి కోసే యంత్రాన్ని దొంగలించారు. మొదట యజమాని దగ్గరకు వచ్చిన వారు తాము అలాంటి యంత్రాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. టెస్టు డ్రైవ్​ కోసం ఓ సారి ఇస్తే తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. అది నమ్మిన యజమాని.. వచ్చిన వారిలో ఒకరికి ఇచ్చారు. అయితే ఇది తీసుకున్న ఆ వ్యక్తి అంతుపంతూ లేకుండా అక్కడ నుంచి దర్జాగా, నెమ్మదిగా ఉడాయించాడు. కొంతసేపటి తరువాత యజమానికి అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. కానీ అప్పటికే దొంగ వెళ్లిపోయాడు. మే 3 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.